
జనం న్యూస్ అక్టోబర్ 5 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమం ప్రధానమంత్రి మోదీ జన్మదిన వేడుకలలో భాగంగా నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 156 మంది రోగులకు చక్కెర, రక్తపోటు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. 14 సంవత్సరాల ఆడపిల్లలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ టీకాపై అవగాహన సదస్సు నిర్వహించారు. గర్భిణీ స్త్రీలకు ప్రధానమంత్రి మాతృ వందనా యోజన ద్వారా మొదటి కాన్పుకు 5000, రెండవ కాన్పుకు 1000 రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ అవుతాయని తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు పోషణ మన బాధ్యత అనే అంశంపై పౌష్టికాహార విశిష్టతను వివరిస్తూ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ శిబిరం వైద్యాధికారి డాక్టర్ ఎం లిఖిత& సి హెచ్ ఓ కే శేషుబాబు& హెల్త్ సూపర్వైజర్ కి మోహన్ పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు డి బాలయ్య, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు మట్టా శివకుమార్, ముమ్మిడివరం మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి, డైరెక్టర్ మట్టా సూరిబాబు, భారతీయ జనతా పార్టీ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోశాధికారి గ్రంథి నానాజీ, జిల్లా నాయకులు సుంకర నాగేశ్వరరావు, నంద్యాల చంటి, బీమాల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు. గ్రామంలో ఇలాంటి వైద్య శిబిరాలు నిరంతరం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.