జనం న్యూస్ అక్టోబర్ ఐదు చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడ మండలం లోనూతనంగా ఏర్పడిన చిలిపిచెడ్ మండల తహసీల్దార్ కార్యాలయం కోసం కింది స్థాయి అధికారులు పంపిన ప్రపోజల్ లో తప్పుల తడకలు బయటపడ్డాయి. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి, తప్పుడు రిపోర్ట్ పంపిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ జూల అనిల్ డిమాండ్ చేశారు.శీలంపల్లి గేటు వద్ద తహసీల్దార్ కార్యాలయం కోసం పంపిన ప్రపోజల్ లో పొజిషన్ ను తప్పుగా చూపించారని ఆరోపణ. అసలు పొజిషన్ మాధవ రెడ్డి గారిది అయితే, దుష్యంత్ రెడ్డి, ధర్మారెడ్డి, భూపాల్ రెడ్డి లది అని తప్పుగా నమోదు చేసి పంపారని తెలిపారు.అంతేకాకుండా, గతంలో రైతు వేదిక కోసం కేటాయించిన 20 గుంటల భూమిలో నుండి 10 గుంటలను తహసీల్దార్ కార్యాలయానికి చూపించడం, ఆర్ అండ్ బి రోడ్డుకు నిబంధనల ప్రకారం వదలాల్సిన స్థలాన్ని వదలకుండా కేవలం సెంటర్ నుండి 20 ఫీట్లు మాత్రమే వదిలి ప్రపోజల్ పంపడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై జిల్లా కలెక్టర్ గారిని కలిసి సమస్య వివరించగా కలెక్టర్ గారు స్పందించి స్వయంగా విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాననిహామీఇచ్చారనీ సర్పంచ్ అనిల్ తెలిపారు.