ఆంధ్రప్రదేశ్

పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన నలుగురిపై కేసు నమోదు

పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన నలుగురిపై కేసు నమోదు

జనం న్యూస్ అక్టోబర్ 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం పోలీస్‌స్టేషన్‌ ముందు రోడ్డుపై ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డంగా కూర్చొని వాహనదారులు, సామాన్య ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగించిన నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో కొంతమంది మహిళలు, పురుషులు పోలీస్‌స్టేషన్‌ ముందు రోడ్డుపై అడ్డంగా కూర్చొని రాకపోకలకు అంతరాయం కలిగిస్తుండగా పోలీస్‌ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. రోడ్డుపై కూర్చొని ప్రజలకు, వాహనదారులకు ఇబ్బంది కలిగించవద్దని సూచించినప్పటికీ, వారు పోలీస్‌ సిబ్బందిని కూడా అడ్డుకొని విధులకు ఆటంకం కలిగించినట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాలను సేకరించగా భూపాలపల్లి గ్రామానికి చెందిన రోడ్ద రామచందర్, గోవిందాపూర్‌ గ్రామానికి చెందిన ఆడుప దేవేంద్ర, భూపాలపల్లి గ్రామానికి చెందిన రోడ్ద సరోజన, రోడ్ద శ్యామలగా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో రాకపోకలకు ఆటంకం కలిగించడంతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా రహదారిపై కూర్చొని వాహనదారులు, ప్రజలకు ఇబ్బంది కలిగించడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం చట్టరీత్యా నేరమని శాయంపేట ఎస్‌ఐ జె. పరమేశ్వర్‌ తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరిధిలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇ-పేపర్