ఆంధ్రప్రదేశ్

పింఛన్లు, టిడ్కో ఇళ్ల ప్రచారం, స్థానిక ఎన్నికల స్టంట్:-పల్లె గ్రీస్మంత్ రెడ్డి

పింఛన్లు, టిడ్కో ఇళ్ల ప్రచారం, స్థానిక ఎన్నికల స్టంట్:-పల్లె గ్రీస్మంత్ రెడ్డి

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా అక్టోబర్ 06, నందలూరు మండలం, నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామ పంచాయతీ లో మంగళవారం రోజున ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకుడు పల్లె గ్రీష్మంత్ రెడ్డి మాట్లాడుతూ, రాబోయే స్థానిక ఎన్నికల్లో ఓట్ల కోసం నూతన పింఛన్లు, టిడ్కో ఇళ్లు మంజూరు చేసి ఇచ్చేస్తా మని కూటమి ప్రభుత్వం ప్రగ ల్బాలు పలుకుతూ ప్రచారం చేస్తోందని, ఇది కూడా సూపర్ సిక్స్ లాంటిదేనని ఆయన విమర్శించారు. రెండున్నరేళ్ల కూటమి పరిపాలనలో ఏనాడు గుర్తు రాని వృద్ధులు, వితంతు వులు, వికలాంగులకు నేడు పింఛన్లు మంజూరు చేస్తామని ప్రచారం చేయడం ఎన్నికల స్టంట్ లో భాగం కాదా?? మరియుసూపర్ సిక్స్ అంటూ విపరీతంగా ప్రచారం చేశారని, వాటిలో ఎన్ని హామీలు నెర వేర్చారో ప్రజలకు చెప్పే దమ్ము కూటమి ప్రభుత్వానికి ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఇకపోతే టిడ్కో ఇళ్ల నిర్మాణం 2019-20 లోనే 80శాతం పూర్తయితే, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఎందుకు అర్హులైన నిరుపేదలకు టిడ్కో ఇళ్లు ఇవ్వలేకపోయిందని ఆయన నిలదీశారు. చంద్రబాబు నాయుడు మరియు ఈ యొక్క దుర్మార్గపు కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఇదివరకే నమ్మి మోస పోయారని, ఇకమీదట మళ్లీ మోసపోవడానికి సిద్ధంగా లేరని తెలియజేశారు.ఐదేళ్ల జగనన్న సుపరిపాలనను మరియు ఈ రెండున్నరేళ్ల చంద్రబాబు నాయుడి రెడ్ బుక్ పరి పాలనను చూసి ప్రజలు ఒక అంచనాకు వచ్చారని, ఏ క్షణంలోనైనా, ఏ ఎన్నికలు వచ్చినా సరే,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ స్థాయిలో పట్టం కట్టడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇ-పేపర్