ఆంధ్రప్రదేశ్

అచ్యుతాపురంలో అంగన్‌వాడీ సిబ్బందికి సత్కారం

అచ్యుతాపురంలో అంగన్‌వాడీ సిబ్బందికి సత్కారం

జనం న్యూస్, అక్టోబర్ 06, అచ్యుతాపురం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా అచ్యుతాపురం మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రంలో మంగళవారం ‘అంగన్ మిలన్ సేవ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు కూండ్రపు నాయుడు బాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ సిబ్బందిని శాలువాలతో సత్కరించారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని నాయకులు తెలిపారు. అనంతరం చిన్నారులకు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలతో మాట్లాడి కేంద్రంలోని వసతులు, పిల్లలకు అందుతున్న పోషకాహారం, వివిధ సేవలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు రాజాన సన్యాసినాయుడు, కోరుపోలు చిన్నారావు, ద్వారపురెడ్డి బాబ్జి, గొంతిన భక్త సాయిరాం, బొందల శ్యామ్, ఎండిపల్లి రాజు, చుక్కా అనురాధ, శిరా చిరంజీవి, మెరుగు కాసుబాబు, బండారు నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్