ఆంధ్రప్రదేశ్

సరస్వతమ్మ మృత దేహానికి యల్లటూరు ఘన నివాళి

సరస్వతమ్మ మృత దేహానికి యల్లటూరు ఘన నివాళి

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన నందలూరు మండలం పాటూరు గ్రామపంచాయతీ పరిధిలోని ఎర్రి పాపయ్యగారిపల్లెకు చెందిన అక్కిరెడ్డి వెంకట రమణారెడ్డి తల్లి అక్కిరెడ్డి సరస్వతమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నేత యల్లటూరు శివరామ రాజు కుటుంబ సభ్యులను పరా మర్శించి, ఆమె మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా సరస్వ తమ్మ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియ జేశారు. ఆమె పవిత్ర ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చా లని ప్రార్థించారు. ఈ కార్య క్రమంలో మాజీ సర్పంచ్లు సమ్మెట శివప్రసాద్, పెమ్మన బోయిన యల్లయ్య, అక్కిరెడ్డి మోహన్‌రెడ్డి, మాజీ వార్డు సభ్యుడు పులి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్