ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి జనం న్యూస్, అక్టోబర్ 06,అచ్యుతాపురం : ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు పెంచి పర్మినెంట్ చేయాలని సెలవులు ఇవ్వాలని జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆశా పోస్టులు మంజూరు చేయాలని తదితర సమస్యలపై ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కి ఎలమంచిలి నియోజకవర్గం ఆశా కార్యకర్తలు,అచ్యుతాపురం ఎమ్మెల్యే నివాసం వద్ద ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ
వినతిపత్రం అందజేయడం జరిగిందని ఆశ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ అనుబంధం జిల్లా కోశాధికారి ఈ పార్వతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మునగపాక పిహెచ్ సి నాయకులు పిఎస్ కుమారి, పి జ్యోతి, అచ్యుతాపురం మండలం డి సరోజిని ,సూర్యలక్ష్మి, సిహెచ్ మంగ, రాంబిల్లి ఆర్ రమ్య ,సిహెచ్ మంగమ్మా రేగుపాలెం ఏ భూలక్ష్మి సీఐటీయూ నాయకులు ఆర్ రాము,జి దేవుడు నాయుడు,కె సోమ నాయుడు తదితరులు పాల్గొన్నారు.