ఆంధ్రప్రదేశ్

కొత్తమ్మవారి దేవస్థాన హుండీ ఆదాయం రూ.3.02 లక్షలు

కొత్తమ్మవారి దేవస్థాన హుండీ ఆదాయం రూ.3.02 లక్షలు

జనం న్యూస్ అక్టోబరు 07 కోటబొమ్మాళి, : మండల కేంద్రంలోని శ్రీ కొత్తమ్మవారి దేవస్థానంలో ధర్మహుండీల లెక్కింపు బుధవారం నిర్వహించారు. 48 రోజులకుగాను హుండీల ద్వారా రూ. 3,02,524 ఆదాయం సమకూరినట్లు దేవస్థానం కార్యనిర్వాహక అధికారి వాకచర్ల రాధాకృష్ణ తెలిపారు. జిల్లా దేవదాయ శాఖ సీనియర్ అసిస్టెంట్ జి. వి. బి. ఎస్. రవికుమార్ పర్యవేక్షణలో హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కోరాడ గోవిందరావు, సభ్యులు బొమ్మాళి ప్రసాదరావు, పాత్రుని గోపి, దేవాది లక్ష్మణరావు, దేవాది నాగరాజు, మంచాల వెంకటరావు, పట్నాయకుని ఇందువదన, అంబటి అప్పారావు, చిగురువలస కనకరాజు తదితరులతో పాటు రెవెన్యూ, పోలీసు, యూనియన్ బ్యాంకు సిబ్బంది, భక్తులు, గ్రామపెద్దలు హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇ-పేపర్