ఆంధ్రప్రదేశ్

పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలి

పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలి

అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: భరత్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్జ నం న్యూస్ అక్టోబర్ 8 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని భరత్ నగర్ కాలనీకి చెందిన అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు తమ పేరును పట్టభద్రుల ఓటరు జాబితాలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని భరత్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు, కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ మేరకు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ పి. నాగిరెడ్డి అధ్యక్షతన కమిటీ సభ్యులు సమావేశమై పట్టభద్రుల ఓటరు నమోదు అంశంపై చర్చించారు. కాలనీలో నివసిస్తున్న అర్హత కలిగిన ప్రతి డిగ్రీ పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకొని రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు సూచించారు. పట్టభద్రుల ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవడం ప్రతి అర్హత కలిగిన పట్టభద్రుడి బాధ్యత అని, ఈ అవకాశాన్ని ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అసోసియేషన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో పట్టభద్రులు చురుకుగా భాగస్వాములు కావాలని వారు కోరారు. ఈ సమావేశంలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రత్నరావు, బిక్షపతి గౌడ్, మూర్తి, నాగేశ్వరరావు, బుచ్చిబాబు, వెంకటేశ్ యాదవ్, నరేష్, శీను, డేవిడ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్