జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం జహీరాబాద్, అక్టోబర్: 09. 10. 2026 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రజాసేవా స్ఫూర్తితో జహీరాబాద్‌లో భారతీయ జనతా యువమోర్చా నాయకులు నరేష్ పాటిల్, సోమ అనిల్, అనిరుద్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, జహీరాబాద్ మాజీ పార్లమెంటు సభ్యులు బీబీ పాటిల్, భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు నౌబాద్ జగన్, రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమం సేవాభావానికి, మానవత్వానికి ప్రతీకగా నిలిచిందని తెలిపారు. ప్రజాసేవకు ప్రాధాన్యతనిస్తూ దేశాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రధానమంత్రి స్ఫూర్తితో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. రక్తదానం చేసిన అనంతరం దాతలకు జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యులు బీబీ పాటిల్, జిల్లా ప్రధాన కార్యదర్శులు జగన్, రాజశేఖర్ రెడ్డి, యువమోర్చా జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి నరేన్ దేశ్‌పాండే చేతుల మీదుగా రక్తదాన ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, జహీరాబాద్ మండల అధ్యక్షుడు దుర్గయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు గొల్ల భాస్కర్, శ్రీనివాస్ గౌడ్, సుధీర్ బండారి, రాష్ట్ర నాయకుడు నరేన్ దేశ్‌పాండే, సోమ అనిల్, నరేష్ పాటిల్, హరీష్, కౌన్సిలర్ బొగ్గుల సంతోష్, అప్పం శ్రవణ్, మండల నాయకులు మల్లేష్, దుర్గన్న, సతీష్ తదితరులు పాల్గొన్నారు.