తెలంగాణ

గాయత్రి నగర్‌లో భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ భూ సమస్యను పరిశీలించిన బండి రమేష్

గాయత్రి నగర్‌లో భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ భూ సమస్యను పరిశీలించిన బండి రమేష్

జనం న్యూస్ అక్టోబర్ 12 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి గాయత్రి నగర్ డివిజన్ పరిధిలోని సర్వే నంబర్ 1007లో ఉన్న భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ భూమికి సంబంధించిన సమస్యను టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మరియు కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ పరిశీలించారు.ఈ సందర్భంగా భూ సమస్యకు సంబంధించిన వివరాలను స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. సమస్యకు సంబంధించిన అంశాలపై నాయకులతో చర్చించి, స్థానికంగా నెలకొన్న పరిస్థితులను సమీక్షించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్య పరిష్కారానికి సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.స్థానిక ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని బండి రమేష్ తెలిపారు. ప్రజల సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, గాయత్రి నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మస్తాన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేముల సత్యం, రాఘవేంద్రరావు, కనకయ్య, విట్టల్ రెడ్డి, ఇంద్ర సింగ్, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్