క్రైమ్ వార్తలు

గట్టుపల్లిలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు

గట్టుపల్లిలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు

గట్టుపల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు.-

సర్పంచ్ బొల్లి పద్మ రాజు ఆధ్వర్యంలో అంబరాన్నంటిన వేడుకలు.-

తీరొక్క పూలతో తరలివచ్చిన ఆడపడుచులు.. లయబద్ధ చప్పట్లతో హోరెత్తిన పల్లె

జనం న్యూస్ 19 అక్టోబర్ (వికారాబాద్ జిల్లా రిపోర్టర్ కావలి నర్సిములు) :- తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ సంబరాలు గట్టుపల్లి గ్రామంలో సర్పంచ్ బొల్లి పద్మ రాజు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగాయి. పండుగ చివరి రోజైన సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు, యువతులు, చిన్నారులు సంప్రదాయ వస్త్రాలు ధరించి తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో తరలిరావడంతో ఊరంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ​ఉదయం నుంచే గునుగు, తంగేడు, బంతి, చామంతి వంటి పూలతో బతుకమ్మలను గోపురాల్లా ఆకర్షణీయంగా పేర్చి, మధ్యలో గౌరమ్మను కొలువుదీర్చారు. సాయంత్రం ప్రధాన ప్రాంగణంలో బతుకమ్మలను ఉంచి, వాటి చుట్టూ తిరుగుతూ మహిళలు లయబద్ధంగా చప్పట్లు కొడుతూ “బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో” అంటూ జానపద గీతాలు ఆలపించారు. ​అనంతరం డప్పు చప్పుళ్ల నడుమ బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి స్థానిక చెరువులో భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. మహిళలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇ-పేపర్