తెలంగాణ

రక్తదానం చేసిన నాగేంద్రనగర్ యువకులు–సర్పంచ్ సందె రంజిత్ అభినందనలు

రక్తదానం చేసిన నాగేంద్రనగర్ యువకులు–సర్పంచ్ సందె రంజిత్ అభినందనలు

జనం న్యూస్, అక్టోబర్ 29, ఏర్గట్ల మండలం: తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ పోలీస్ సబ్ డివిజన్ నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో గురువారం నాగేంద్రనగర్ గ్రామానికి చెందిన యువకులు దండుగుల దినేష్, అలేపు సంతోష్ స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సందె రంజిత్ వారిని అభినందించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ సందె రంజిత్ మాట్లాడుతూ, రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. యువత సామాజిక బాధ్యతను గుర్తించి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమని పేర్కొన్నారు. దినేష్, సంతోష్ రక్తదానం చేసి గ్రామానికి గర్వకారణంగా నిలిచారని తెలిపారు. వీరిని ఆదర్శంగా తీసుకొని మరింత మంది యువకులు రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్నవారికి ప్రాణదానం చేసే అవకాశం ఉంటుందని, ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన యువకులకు ప్రత్యేక అభినందనలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఇ-పేపర్