ఆంధ్రప్రదేశ్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో వరుదు కళ్యాణి మలశాల భరత్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో వరుదు కళ్యాణి మలశాల భరత్

జనం న్యూస్ అక్టోబర్ 29 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి నియోజకవర్గం లోని 107 నుండి 112 వార్డుల వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశాలు బుధవారం నిర్వహించారు సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశాలకు జీవీఎంసీ వైయస్సార్సి పి మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు అనకాపల్లిలోని వివేకానంద ఫంక్షన్ హాల్ లో 110,111,112, వార్డుల సమావేశం నిర్వహించగా జిల్లా పార్టీ కార్యాలయంలో.107,108,109 వార్డులకు సంబంధించిన సమావేశం జరిగింది ఈ సందర్భంగా వరుదు కళ్యాణి మాట్లాడుతూ రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రతి వార్డులో ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ పార్టీ అభ్యర్థులకు మద్దతు కూడగట్టాలని సూచించారు ఈ సమావేశాల్లో 107వ వార్డు అభ్యర్థి పన్నీరు వెంకట లక్ష్మి, 108 వ వార్డు అభ్యర్థి బొడ్డేడ సరోజినీ, 109 వ వార్డు అభ్యర్థి, కర్రి లలిత, 110 వ వార్డు అభ్యర్థి, ఉగ్గిన జోష్ణ పద్మజ,111 వ వార్డు అభ్యర్థి, నదియా, 112 వ వార్డు అభ్యర్థి, జాజుల ప్రసన్న లక్ష్మి, పాల్గొన్నారు. ఆరు వార్డుల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా వైయస్సార్సీపి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, నియోజకవర్గ సమన్వయకర్త మలశాల భరత్ కుమార్, మాజీ ఎంపీ డాక్టర్ కేవీ సత్యవతి, పార్టీ నాయకులు జానకిరామ్, శోభ హైమావతి సతీష్ వర్మ రవిరాజ్ తదితరులు పాల్గొన్నారు. వీరితోపాటు బూత్ ఏజెంట్లు, ముఖ్య నాయకులు కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఇ-పేపర్