తెలంగాణ

శ్రీ మత్స్యగిరి స్వామి ఉత్సవమూర్తులు రథంపై జమ్మి చెట్టు వరకు యాత్ర

శ్రీ మత్స్యగిరి స్వామి ఉత్సవమూర్తులు  రథంపై జమ్మి చెట్టు వరకు యాత్ర

జనం న్యూస్ అక్టోబర్ 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో ని అతి పురాతనమైన చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో మంగళవారం దసరా ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించినారు. అనంతరం శ్రీ మత్స్యగిరి స్వామి దేవస్థానం చైర్మన్ సామల బిక్షపతి మాట్లాడుతూ గ్రామంలో దసరా వేడుకల అనంతరం శ్రీ మత్స్యగిరి స్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేక రథం వాహనంలో ఉంచి డప్పు చప్పుళ్ళ మధ్య గ్రామ పురవీధుల గుండా ఊరేగించారు. హరిజనవాడలోని జమ్మిచెట్టు వద్దకు తీసుకొని వెళ్లి అక్కడ జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి జమ్మి పూజను నిర్వహిస్తారు అని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జిన్నా ప్రతాప్ సేన రెడ్డి రాజారాం రెడ్డి మారపల్లి రవీందర్ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి వంగల పరమేశ్వర్ రమేష్ బాసాని సాయి తేజ వలపదాసి వెంకటరమణ ఏ.శంకర్ పొడిసెట్టి గణేష్ ఉప్పురాజు మంత్రి రాజు బాసాని సదాశివుడు మారపల్లి రమేష్ భక్తులు ఎస్ పి టి యూత్ శాయంపేట అమ్మవారి దీక్షలో ఉన్న స్వాములు అధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు…..

ఇ-పేపర్