ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం అభినందనీయం – శేరి సతీష్ రెడ్డి
జనం న్యూస్ | అక్టోబర్ 28 | తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కూకట్పల్లి నియోజకవర్గం, కేపీహెచ్‌బీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్లియా క్లినిక్ అండ్ ఫార్మసీ ఘనంగా ప్రారంభమైంది. కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, డాక్టర్ రాంబాబు ఆహ్వానం మేరకు క్లినిక్‌ను ప్రారంభించారు.కేపీహెచ్‌బీ కాలనీలోని టెంపుల్ బస్ స్టాప్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమం సందడిగా జరిగింది. ఈ సందర్భంగా శేరి సతీష్ రెడ్డి మాట్లాడుతూ, నేటి సమాజంలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండటం ఎంతో అవసరమని పేర్కొన్నారు. వైద్య రంగంలో సేవా దృక్పథంతో ముందుకు వచ్చి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయడం అభినందనీయ మని అన్నారు.నూతనంగా ప్రారంభమైన ఆర్లియా క్లినిక్ అండ్ ఫార్మసీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ, ప్రజల ఆదరాభిమానాలు పొందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా క్లినిక్ నిర్వాహకులు డాక్టర్ రాంబాబుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు.కాంగ్రెస్ నాయకుల సందడి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, యువజన నాయకులు, మిత్రులు పాల్గొని డాక్టర్ రాంబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కోఆర్డినేటర్ మేకల మైకేల్, ఉమ్మడి కేపీహెచ్‌బీ డివిజన్ మాజీ అధ్యక్షులు తమ్మినేని ప్రవీణ్, కొమ్ము బాబు, శ్రీధర్ చారి, గిరి నాయుడు, యూత్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు కళ్యాణ్, వసంతనగర్ డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గా, నాగబాబు తదితరులు పాల్గొన్నారు.ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఆర్లియా క్లినిక్ అండ్ ఫార్మసీ మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదించాలని పలువురు ఆకాంక్షించారు.