తెలంగాణ

గ్రాడ్యుయేట్‌ ఓటర్ల నమోదుపై బీజేపీ సమీక్ష ఓటర్ల నమోదు ప్రక్రియపై వీరేందర్‌గౌడ్‌ ఆరాఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం

గ్రాడ్యుయేట్‌ ఓటర్ల నమోదుపై బీజేపీ సమీక్ష ఓటర్ల నమోదు ప్రక్రియపై వీరేందర్‌గౌడ్‌ ఆరాఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం

జనం న్యూస్ అక్టోబర్ 28 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. వీరేందర్‌గౌడ్‌ సూచించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎన్నికల ఇన్‌ఛార్జిగా ఆయన నియమితులైన నేపథ్యంలో, ఉమ్మడి వివేకానందనగర్‌ డివిజన్‌ పరిధిలోని బాగ్‌ అమీర్‌లో డివిజన్‌ అధ్యక్షుడు ఎన్‌. వంశీరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి రవికుమార్‌ యాదవ్‌తో కలిసి ఓటర్ల నమోదు పురోగతిని సమీక్షించారు. అనంతరం పార్టీ నాయకులతో సమావేశమై ఎన్నికల సన్నద్ధత, ఓటర్ల నమోదుపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురభి రవీందర్‌రావు, మహిపాల్‌రెడ్డి, స్రవంతి, భాస్కర్‌రెడ్డి, డివిజన్‌ ప్రధాన కార్యదర్శులు రేపన్‌ రాజు, వేణు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్