వైరల్ వార్తలు

బలుసుతిప్ప పునరావాస కేంద్రంలో బాధితులకు భరోసా – ముందస్తు చర్యలతో ప్రాణ నష్టం నివారణ

బలుసుతిప్ప పునరావాస కేంద్రంలో బాధితులకు భరోసా – ముందస్తు చర్యలతో ప్రాణ నష్టం నివారణ

జనం న్యూస్ అక్టోబర్ 28, ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ: ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గ్రామంలోని పునరావాస కేంద్రాన్ని ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఎంపీ గంటి హరీష్ మాధుర్ సందర్శించి బాధితులను పరామర్శించారు. పునరావాస కేంద్రంలో బాధితులకు కల్పిస్తున్న భోజనం, మంచినీరు, ఇతర మౌలిక సదుపాయాలను స్వయంగా పరిశీలించారు. బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఆర్నాబ్ తుఫాను ముప్పును ముందుగానే గుర్తించి ప్రజల రక్షణకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టిందని తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు అందించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఇళ్లు, పంటలు, పడవలు తదితర ఆస్తులకు నష్టం వాటిల్లిన బాధితుల నష్టాలను అంచనా వేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. విపత్కర పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలిచి అవసరమైన సహాయం అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఎంపీ గంటి హరీష్ మాధుర్ విజ్ఞప్తి చేశారు. వీరితో పాటు టీడీపీ మండల ఇంచార్జ్ దాట్ల పవన్, మాజీ ఆగ్రికల్చర్ కార్పొరేషన్ చైర్మన్ నాగిడి నాగేశ్వరరావు, బలుసుతిప్ప పంచాయతీ మాజీ ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్