జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు బుధవారం 28-10-2026 అక్టోబర్ 2 నుండి 5 వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ లో జరిగిన రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్లో వనపర్తి జిల్లా జట్టు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానాన్ని పొందడం జరిగింది. జట్టులో అత్యంత ప్రతిభ కనబరిచిన భాస్కర్* (సేరిపల్లె గ్రామం ), ఆంజనేయులు (మూలమల్ల గ్రామం ) వీరు ఇద్దరూ బీహార్ లో నవంబర్ 1 నుండి 4 వరకు జరిగే జాతీయ స్థాయి కబడ్డీ క్రీడల్లో పాల్గొంటారని వనపర్తి కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ M కురుమయ్య గారు తెలిపారు. మన జిల్లా నుండి జాతీయ స్థాయికి ఇద్దరు ఎంపికైనందుకు కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు: వెంకటేశ్వర రెడ్డి గారు,చైర్మన్ శ్రీమతి పద్మజా రెడ్డి గారు, జనరల్ సెక్రటరీ M కురుమయ్య ఉపాధ్యక్షులు: దామోదర్ గారు, తిరుపతయ్య గారు, కోశాధికారి: R గోపాల్ గారు, మరియు వెంకట రాములు, చందు, సురేష్, వెంకటేష్, అశోక్, కమలాకర్ నాగరాజు గార్లు ఆనందం వ్యక్తం చేసి అభినందించారు. జూనియర్ బాలుర టీం 10 రోజుల క్యాంపు నిర్వహనకు అతిత్యం ఇచ్చింటువంటి పెబ్భైర్ ZPHS హెడ్ మాస్టర్ శ్రీ G నరసింహ గౌడ్, ఉపాధ్యా బృందం అదేవిదంగా టీం కి డ్రెస్ దాత శ్రీ నిలవ రెడ్డి గారు క్రీడాకారులను అభినందించడం జరిగింది అసోసియేషన్ మంచి ఫెసిలిటీస్ కల్పించి క్యాంపులు నిర్వహిస్తుండడంతో 33 జిల్లాలలో వనపర్తి జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రతిసారి మొదటి, రెండు స్థానాలలో నిలబడుతుందని ఆర్గనైజింగ్ సెక్రటరీ: మధు గారు తెలియజేశారు.