తెలంగాణ

యాసంగిలో ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన

యాసంగిలో ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన

దోంచందాలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమం

జనం న్యూస్ అక్టోబర్ 28: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం దోంచంద గ్రామంలో ‘ఖేత్ బచావో అభియాన్’ కార్యక్రమంలో భాగంగా రైతులకు వ్యవసాయ, ఉద్యాన పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని యాసంగి సీజన్‌లో వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని వ్యవసాయ అధికారులు రైతులకు సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో దోంచంద గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ కొరిపెల్లి లింగారెడ్డి, మండల వ్యవసాయ అధికారి వైష్ణవ్, ఉద్యాన అధికారి రుద్ర వినాయక్, వ్యవసాయ విస్తరణ అధికారిణి సవిత, గ్రామ రైతులు పాల్గొన్నారు.

ఇ-పేపర్