జనం న్యూస్ అక్టోబర్ 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కేపిహెచ్ బి నాలుగవ ఫేస్లోని పార్కులు సరైన నిర్వహణ లేక పూర్తిగా నిర్వీర్యంగా మారాయని పార్కులలో పిచ్చిమొక్కలు పెరిగిపోవడం, చెత్తాచెదారంతో నిండిపోవడంతో పారిశుద్ధ్యం తీవ్రంగా దెబ్బతిన్నదని పిచ్చిమొక్కల కారణంగా పాముల బెడద తీవ్రమైందని, కేవలం రాత్రి వేళల్లోనే కాకుండా పగటిపూట కూడా పాములు సంచరిస్తూ చుట్టుపక్కల ఇళ్లలోకి వస్తున్నాయని దీని వలన కాలనీవాసులు ముఖ్యంగా చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని, అంతేకాకుండా, పార్కుల సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల తాగుబోతులకు అడ్డాగా మారాయని కాలనీ వాసుల నుండి జనసేన నాయకులకు తెలియజేయడం వలన కాలనీవాసుల భద్రత మరియు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, జీహెచ్ఎంసీ అధికారులు తక్షణమే స్పందించాలని కోరుతూ కాలనీ వాసుల తరుపున కూకట్ పల్లి జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్ కి జనసేన నాయకులు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు వివరించిన సమస్యలను జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్ సానుకూలంగా స్వీకరించారు, కాలనీవాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై స్పందిస్తూ, సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొల్లా శంకర్, ఆళ్ల నరేంద్ర, పోలేబోయిన శ్రీనివాస్ గోవిందా, పి.గోపి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.