తెలంగాణ

బట్టాపూర్ స్మశాన వాటికకు విద్యుత్ లైన్ మంజూరు

బట్టాపూర్ స్మశాన వాటికకు విద్యుత్ లైన్ మంజూరు

సర్పంచ్ ప్రవీణ్ యాదవ్, ఉపసర్పంచ్ దయానంద్ కృషి

జనం న్యూస్ అక్టోబర్ 29: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలం: బట్టాపూర్ గ్రామంలోని స్మశాన వాటిక వద్ద విద్యుత్ సౌకర్యం లేక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు సర్పంచ్ ప్రవీణ్ యాదవ్, ఉపసర్పంచ్ దయానంద్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, సంబంధిత జిల్లా అధికారి రమేష్, ఏఈ సురేష్ గ్రామానికి వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి అంచనాలు సిద్ధం చేశారు. వారి నిరంతర కృషి ఫలితంగా ఇందిరమ్మ కాలనీ నుంచి స్మశాన వాటిక వరకు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైను మంజూరయ్యాయి. గ్రామ ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించడమే తమ లక్ష్యమని సర్పంచ్ ప్రవీణ్ యాదవ్, ఉపసర్పంచ్ దయానంద్ తెలిపారు. గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న అధికారులకు, గ్రామ ప్రజలకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

ఇ-పేపర్