జనం న్యూస్ అక్టోబర్ 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి :ఖైతలాపూర్ డివిజన్ పరిధిలోని ఆంజనేయ నగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ఆంజనేయ నగర్ కాలనీలో పర్యటించారు.ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు, కాలనీ వాసులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కాలనీ సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలతో సమావేశమై కాలనీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించినందుకు సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు రాజేశ్వరరావు కి కృతజ్ఞతలు తెలియజేశారు. కాలనీవాసులు వివరించిన సమస్యలపై రాజేశ్వరరావు సానుకూలంగా స్పందిస్తూ, సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అంతేకాకుండా, ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూడకుండా, తన వంతు సహకారాన్ని అందిస్తూ ఆంజనేయ నగర్ కాలనీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, ప్రజలకు అందుబాటులో ఉంటూ కాలనీల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఈ సందర్భంగా రాజేశ్వరరావు స్పష్టం చేశారు.