బిచ్కుంద నవంబర్ 3 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా నిన్న బిచ్కుంద మండలంలోని కందర్ పల్లి , బిచ్కుంద లోకల్ మరియు పెద్దదడిగి గ్రామాల్లో విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు పేకాట స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న మొత్తం 18 మందిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది ఎస్సై రాజు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.21,600 నగదు, 10 సెల్ఫోన్లు మరియు 2 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా బిచ్కుంద పోలీసులు గట్టి హెచ్చరిక జారీ చేస్తున్నారు.బిచ్కుంద పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా పేకాట, జూదం లేదా ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై ఎలాంటి ఉపేక్ష లేకుండా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జూదం వల్ల కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా నష్టపోతాయని ప్రతి ఒక్కరూ గుర్తించాలి.దీపావళి పండుగను ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా, ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలి. పండుగ సందర్భంగా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని, ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని పోలీసులు సూచిస్తున్నారు.ఎక్కడైనా పేకాట, జూదం లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగు తున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే ప్రజలు డయల్ 112 లేదా బిచ్కుంద ఎస్హెచ్ఓ నంబర్ 8712686176కు సమాచారం అందించాలని కోరుతున్నారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచడం జరుగుతుంది.ప్రజల భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యం. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని బిచ్కుంద ఎస్సై గుండె రాజు విజ్ఞప్తి చేస్తున్నారు.