జనం న్యూస్ 09/11/2026 పట్టణ అధ్యక్షుడు నరేష్ గౌడ్ మరియు రాష్ట్ర నాయకులు డా. సిద్ధం ఉజ్వల్ రెడ్డి* జహీరాబాద్ నవంబర్ 09-: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ యూనుస్ ముందుగా కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డా. సిద్ధం ఉజ్వల్ రెడ్డి తో కలసి ఆసుపత్రి ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి చికిత్స నిమిత్తం వచ్చిన రోగులు, వారి సహాయకులు, ఇతరులకు భోజనాన్ని అందజేశారు. ముఖ్యమంత్రి జన్మదినాన్ని కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా, సేవా కార్యక్రమం ద్వారా జరుపుకోవడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం దిశగా మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో, ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తూ సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘకాలం ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ద్వారా మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమంతో జరుపుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరేష్ గౌడ్, మాజీ అధ్యక్షుడు కండెం నరసింహులు, వైస్ చైర్మన్ శిరీష సురేందర్ రెడ్డి, కౌన్సిలర్లు జహంగీర్, జమీలుద్దీన్, జైన అక్రమ్, నిజాముద్దీన్, మహేష్, వకీల్ చౌవన్, మాజీ వైస్ చైర్మన్ ఖాజామియా,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు , శ్రీకాంత్ రెడ్డి, నాగిరెడ్డి, శ్రీనివాస్ నాయక్, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.