తెలంగాణ

నిబంధనలకు విరుద్ధంగా ప్రకటించిన ఇందిరమ్మ ఇండ్ల జాబితాను రద్దు పరచాలి*

నిబంధనలకు విరుద్ధంగా ప్రకటించిన ఇందిరమ్మ ఇండ్ల జాబితాను రద్దు పరచాలి*

అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ నవంబర్ 9 వలిగొండ* మండల పరిధిలోని వెలువర్తి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్ల రెండో జాబితాలో గ్రామపంచాయతీ పాలకవర్గం నిబంధనలకు విరుద్ధంగా పట్టణాలలో బహుళ అంతస్తులు ఉన్నవారికి, ఆర్థిక అభివృద్ధి ఉన్నవారికి ఏకపక్ష నిర్ణయంతో ఇళ్లను కేటాయించడం తో నిజమైన లబ్ధిదారులు నష్టపోతున్నారని వెలువర్తి గ్రామ మాజీ సర్పంచ్ మల్లం శ్రీనివాస్ గౌడ్ సోమవారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో లబ్ధిదారుల జాబితాను రద్దు పరచాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు అందకుండా గ్రామపంచాయతీ పాలకవర్గం, అధికార పార్టీ నాయకులు వారి ఇష్టానుసారంగా గ్రామసభ నిర్వహించకుండా ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడం విడ్డూరంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల జాబితాపై పూర్తిస్థాయిలో పరిశీలన జరిపి నిజమైన అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

ఇ-పేపర్