ఆంధ్రప్రదేశ్

నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు లక్ష్యం

నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు లక్ష్యం

జనం న్యూస్ నవంబర్ 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం భూపాలపల్లి నియోజక వర్గ అభివృద్ధి లక్ష్యంగా భూపాలపల్లి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పనిచేస్తున్నారని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జన్మదిన వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు సోమవారం వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున వేడుకల్లో పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. డీ జే సౌడ్స్ మధ్య బాణ సంచా కాల్చుతూ డ్యాన్సులు చేసి సంబురాలు చేసుకున్నారు. అనంతరం కేక్ కటింగ్‌, పండ్ల పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బుచ్చిరెడ్డి మాట్లాడుతూ…ప్రజలతో మమేకమవుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఆయన మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అందుకు భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు నిర్వహించడంతో మండలం లో పండగ వాతావరణం నెలకొంది.ఈ వేడుకలలో నాయకులు చల్లా చక్రపాణి, బాసాని చంద్రప్రకాష్, మారపెల్లి రవీందర్, వైనాల కుమార్, చిందం రవి, శానం కుమారస్వామి, సాధు నాగరాజు, కొమ్ముల భాస్కర్, కట్టయ్య, సదానందం, శరత్, పలు గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్