పాల్గొన్న ఇందిరమ్మ కమిటీ సభ్యులు. జనం న్యూస్ నవంబర్ 9, ( పరిగి నియోజకవర్గం ఇంచార్జి ) వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం చింతలపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంట్లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో చింతలపల్లి గ్రామము ఇందిరమ్మ కమిటీ సభ్యులు కుని జయరాజు (నర్సిములు ), మాజీ ఎంపిటిసి వై నర్సిములు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్నమ్మోళ్ల కిష్టరెడ్డి, పెద్దిరెడ్డి సురేందర్ రెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ యాటకారి బిక్షపతి బోడంపాటి బాల కృష్ణారెడ్డి , పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిలో గృహప్రవేశం చేసి,కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు.అనంతరం వారికి స్వీట్లు,టపాకాయలు అందజేసి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్లు ప్రతి కుటుంబానికి ఆనందాన్ని తీసుకువస్తున్నాయని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.