తెలంగాణ

ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జనంపల్లి పురేందర్ రెడ్డి

ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జనంపల్లి పురేందర్ రెడ్డి

జనం న్యూస్ నవంబర్ 9 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర శాసనసభ పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జనంపల్లి పురేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీని శాలువాతో ఘనంగా సన్మానించి, మిఠాయిలు అందజేసి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. దీపావళి పండుగ చీకటిని తొలగించి వెలుగులు నింపే పండుగ అని, అదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరి హృదయంలో ఆనందం, ఆశ, సంతోషం నిండాలని పేర్కొన్నారు. ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పి. రాజేంద్ర పటేల్, సంజీవరెడ్డి, చందు సాగర్, ప్రవీణ్ సాగర్, మల్లయ్య, నాని తదితరులు పాల్గొని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జనంపల్లి పురేందర్ రెడ్డి మాట్లాడుతూ వివేకానంద నగర్ డివిజన్ ప్రజలకు, తన మిత్రులకు, బంధువులకు, పత్రికా సోదరులకు, కాలనీ వాసులకు, అసోసియేషన్ కమిటీ సభ్యులకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఇంటా దీపాల వెలుగులు నిండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

ఇ-పేపర్