ఆంధ్రప్రదేశ్

జహీరాబాద్ నియోజకవర్గంలో రైతు సంఘం సమావేశం.. సంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీగా యూనిస్‌కు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం

జహీరాబాద్ నియోజకవర్గంలో రైతు సంఘం సమావేశం.. సంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీగా యూనిస్‌కు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం

జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ వీరేశం నవంబర్ 16. 11. 2026 జహీరాబాద్ నియోజకవర్గంలో ఆదివారం సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజు అధ్యక్షత వహించి, సంఘం బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణ, జిల్లా స్థాయిలో నాయకత్వ బాధ్యతల భర్తీ తదితర అంశాలపై సభ్యులతో చర్చించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘంలో ఖాళీగా ఉన్న జిల్లా జనరల్ సెక్రటరీ పోస్టును భర్తీ చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జిల్లా స్థాయిలో సంఘం కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం స్పందిస్తూ సంఘం అభివృద్ధికి కృషి చేసే విధంగా జనరల్ సెక్రటరీ బాధ్యతలను అప్పగించాలనే అంశంపై చర్చించారు. ఈ క్రమంలో యూనిస్‌కు సంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ బాధ్యతలు అప్పగించాలని రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజు అభిప్రాయం వ్యక్తం చేయగా, సమావేశంలో ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా రైతు సంఘం కార్యకలాపాలను విస్తరించి, రైతుల సమస్యల పరిష్కారం కోసం నాయకులు, సభ్యులందరూ సమన్వయంతో పనిచేయాలని బాలరాజు సూచించారు. సంఘం లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనిస్, అఖిల్, ఐమత్, జైమాంత్, ఇస్మాయిల్, వసీంఖాన్, జూనియర్ తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్