జనం న్యూస్ – నవంబర్ 16: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం సోమవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మూడు రోజుల పాటు కొనసాగిన ఈ ఆధ్యాత్మిక వేడుకలు వేదమంత్రోచ్ఛారణలు, ప్రత్యేక పూజలు, యజ్ఞ కార్యక్రమాలతో వైభవంగా జరిగాయి. అర్చకులు రమేష్ శర్మ, విష్ణుశర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి విగ్రహ ప్రతిష్ఠాపన జరిపించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యాదవ సంఘం సభ్యులందరమూ మాట్లాడుతూ.. సంఘ సభ్యులమంతా ఐకమత్యంతో సమిష్టిగా కృషి చేసి మూడు రోజుల మహోత్సవాన్ని విజయవంతం చేశామని తెలిపారు. ఈ వేడుకలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ యాదవ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.
మహోత్సవానికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ రెడ్డి, మానాల మోహన్ రెడ్డి హాజరయ్యారు. యాదవ సంఘం సభ్యులు వారికి ఆలయంలో స్వాగతం పలకగా, అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం యాదవ సంఘం ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించి, స్వామివారి చిత్రపటంతో కూడిన జ్ఞాపికను అందజేశారు. అదేవిధంగా స్థానిక ఎస్ఐ పడాల రాజేశ్వర్, ఏలేటి లక్ష్మారెడ్డి స్వామివారిని దర్శించుకోగా, యాదవ సంఘం సభ్యులు వారిని సన్మానించి స్వామివారి చిత్రపటంతో కూడిన జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సోమ దేవారెడ్డి, బాల్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆడెం గంగాప్రసాద్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యాదవ సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
మూడు రోజుల