జనం న్యూస్ 16 నవంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్ర బీ ప్రణాళిక పంటల వైవిధ్యీకరణకు ప్రత్యేక కార్యాచరణ రైతుల వివరాల నమోదు కోసం ప్రత్యేక ఆన్లైన్ యాప్ రైతులు తమకు ఆసక్తి ఉన్న ప్రత్యామ్నాయ పంటలు సాగు విస్తీర్ణం, వ్యవసాయ అవసరాలను ఏఈఓల ద్వారా నమోదు చేసుకోవాలి యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి ఆరుతడి పంటలు సాగుచేసే రైతుల వివరాలు సేకరించాలి రైతులకు అండగా ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం గ్రామాల్లో పర్యటించి ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి యాసంగి పంటల ప్రణాళికలో పంటల మార్పిడికి ప్రాధాన్యం రెండు రోజుల్లో ఆరుతడి పంటల సాగు వివరాలతో నివేదిక సమర్పించాలి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో జిల్లాలో వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలను రైతులు సాగు చేసేలా వ్యవసాయ శాఖ అధికారులు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.యాసంగి సీజన్లో ఎట్టి పరిస్థితుల్లో రైతులు వరి సాగుచేసి నష్టపోకుండా చూడాలని ప్రభుత్వం ప్రణాళికను రూపొందించిందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏఈవోలు అన్ని గ్రామాల్లో పర్యటించి రైతులు ఏ ఏ పంటలు సాగు చేస్తున్నారో వివరాలు సేకరించి రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక పంపాలని ఆదేశాలు జారీ చేశారు ఇందుకు సంబంధించి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే ఏఈవోలకు స్పష్టమైన సూచనలు ఇచ్చారన్నారు. రెండు రోజుల పాటు పర్యటించి ఆరుతడి పంటలు ఏ రైతు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారో అందుకు సంబంధించిన వివరాలను సేకరించి ప్రభుత్వానికి పంపించాల్సి ఉందన్నారు.నీటి లభ్యత నేల స్వభావం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని రైతులకు అధికారులు సూచించాలన్నారు. చలి కాలంలోనూ ఎండ తీవ్రత కనిపిస్తుండటంతో రానున్న రోజుల్లో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉందన్నారు. దీంతో తక్కువ నీటితో పంటలు సాగు చేసేలా వ్యవసాయ శాఖ ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. ఎవరైనా రైతులు వరిని సాగుచేసే ప్రయత్నాలు చేస్తే వారికి అవగాహన కల్పించి విరమింపజేయలన్నారు.పంటల మార్పిడే ప్రధాన లక్ష్యం ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని యాసంగి పంటల సాగుకు పంటల వైవిధ్యం, పంటల మార్పిడికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దీని ఆధారంగా యాసంగి పంటల సాగు కార్యచరణ ప్రణాళిక, జిల్లా స్థాయి ప్రణాళిక పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. సోలార్ ఫెన్సింగ్ డ్రిప్ స్ప్రింక్లర్లు రెయిన్ గన్స్ ప్రెజర్ గన్స్ పశుగ్రాస విత్తనాలు మినీ ట్రాక్టర్ల తదితర రైతుల అవసరాలను గుర్తించాలన్నారు.రబీ సీజన్‌కు సంబంధించి పంటల ప్రణాళిక పంటల వైవిధ్యీకరణ వరికి ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యాచరణలో భాగంగా రైతుల పంటల వివరాలు సాగు విస్తీర్ణం నీటి వనరులు నీటి పారుదల పరికరాలు ఇతర వ్యవసాయ అవసరాలను నమోదు చేసేందుకు ప్రత్యేక ఆన్లైన్ యాప్‌ను రూపొందించడం జరుగుతుందన్నారు. ఈ యాప్‌లో వ్యవసాయ విస్తరణ అధికారులు తమ లాగిన్ ద్వారా రైతుల వివరాలను నమోదు చేయలన్నారు. రైతులు తమ గ్రామానికి సంబంధించిన క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి తమకు ఆసక్తి ఉన్న పంటల రకాలు సాగు విస్తీర్ణం నీటి పారుదల సదుపాయాలు ఇతర అవసరాలను నమోదు చేయించుకోవాలన్నారు. వరి సాగుకు ప్రత్యామ్నాయంగా కుసుమ టమాటా బీరకాయ సొరకాయ బెండకాయ మిరప ఆకుకూరలు, పప్పుధాన్యాలు పెసర మినుము శనగ వేరుశనగ పొద్దుతిరుగుడు నువ్వులు తదితర పంటల సాగుపై రైతులు తమ ఆసక్తిని నమోదు చేసుకునేలా అధికారులు ప్రోత్సహించాలన్నారు. ఆయా పంటలకు అవసరమైన సాగు విస్తీర్ణం, డ్రిప్, స్ప్రింక్లర్లు, రెయిన్ గన్స్, ప్రెజర్ గన్స్ వంటి నీటి పారుదల పరికరాల అవసరాలను కూడా రైతుల వారీగా నమోదు చేయలన్నారు కోతుల బెడద నివారణకు సోలార్ ఫెన్సింగ్కో తుల బెడద కారణంగా పంటలకు కలుగుతున్న నష్టాన్ని నివారించేందుకు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు అవసరాలను కూడా యాప్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పించడం జరిగిందన్నారు ఒకే ప్రాంతంలో 25 ఎకరాలకు పైగా భూమి కలిగి ఉన్న రైతులు సమూహంగా సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకు ఆసక్తి చూపినట్లయితే అటువంటి భూములను ఒక సోలార్ ఫెన్సింగ్ క్లస్టర్‌గా ఏర్పాటు చేసేలా ఏఈఓలు వివరాలను నమోదు చేయలన్నారు. ఇందుకు ఆసక్తి ఉన్న రైతులు తమ గ్రామ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి వివరాలను నమోదు చేయించుకోవాలన్నారు. పశుగ్రాస విత్తనాలు మినీ ట్రాక్టర్ల అవసరాల నమోదుపశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నేపియర్ గడ్డి పశుగ్రాస జొన్న పశుగ్రాస మొక్కజొన్న, తదితర పశుగ్రాస పంటల విత్తనాల అవసరాలను రైతుల వారీగా నమోదు చేయలన్నారు. అలాగే ఉద్యానవన శాఖకు సంబంధించిన మినీ ట్రాక్టర్ల అవసరాలను కూడా రైతుల వారీగా నమోదు చేసుకునే అవకాశం కల్పించాలన్నారు. రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా తమ భూముల స్వభావం నీటి లభ్యత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వివిధ పంటలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ సూచిస్తోందన్నారు. ముఖ్యంగా పత్తి సాగు చేస్తున్న రైతులను పంటల మార్పిడి వైపు ప్రోత్సహిస్తూ డ్రిప్ పద్ధతిలో కూరగాయలు మిరప సాగు చేపట్టేలా అవగాహన కల్పించలన్నారు.మొక్కజొన్న సాగులో డ్రిప్ ఇరిగేషన్ సోలార్ ఆధారిత విధానాలను ప్రోత్సహించడంతో పాటు పొద్దుతిరుగుడు సాగులో డ్రిప్ ఇరిగేషన్ మరియు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వలన్నారు. జీరో టిల్లేజ్ విధానంలో మొక్కజొన్న పప్పుధాన్యాల సాగు, కలబంద సాగు డ్రిప్ ఇరిగేషన్‌తో పసుపు అల్లం సాగును ప్రోత్సహించలన్నారు. పంటల వైవిధ్యీకరణ ఆధునిక సాగు పద్ధతుల అమలు వివిధ శాఖల సమన్వయంతో రైతులకు అవసరమైన సదుపాయాలను కల్పించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంపొందించడం సాగు ఖర్చులను తగ్గించడం స్థిరమైన వ్యవసాయ అభివృద్ధిని సాధించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. జారీ చేయువారు: డీపీఆర్ఓ జోగులాంబ గద్వాల జిల్లా.