జనం న్యూస్ నంబర్ 19 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గంలోని వివేకానంద నగర్ కాలనీలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం అష్టాదశ మహా పడిపూజ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా జరిగింది. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తనయుడు మాధవరం సందీప్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహా పడిపూజ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వాములు అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారి భజనలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుటుంబ సభ్యులు, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్ కుమార్ మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు,మాజీ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ కుటుంబ సభ్యులు, అయ్యప్ప స్వాములు, కూకట్పల్లి నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులందరికీ స్వామివారి తీర్ధ ప్రసాదములు వితరణ కార్యక్రమం నిర్వహించారు.