జనం న్యూస్ నవంబర్ 19 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మానసనపల్లి: అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన నూతన పెన్షన్ల పత్రాలను మానసనపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధులు, నిరుపేదలు, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. పేద కుటుంబాలకు పెన్షన్లు ఆర్థికంగా అండగా నిలుస్తాయని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి గోపి, సర్పంచ్ గోపి నాయక్, ఉపసర్పంచ్ హీరు, మాజీ సర్పంచ్ మాన్య, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు జయరాం, గ్రామ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.