జనం న్యూస్ నవంబర్ 19( రిపోర్టర్ రాజేందర్) మహా ముత్తారం మండల కేంద్రంలో భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళగా పేరుగాంచిన స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి వేడుకలను ఈరోజు మహముత్తారం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జాడి రాజయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కలిసి ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ సమగ్రత, సమైక్యత, అభివృద్ధి కోసం ఆమె చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. భారతదేశ రాజకీయ చరిత్రలో ఇందిరా గాంధీ తనదైన ముద్ర వేశారని, పేద ప్రజల సంక్షేమం, మహిళా సాధికారత, దేశ అభివృద్ధి కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారని నాయకులు పేర్కొన్నారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ఆమె చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఆమె చూపిన ధైర్యం, నాయకత్వ పటిమ, ప్రజాసేవా స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని తెలిపారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జాడి రాజయ్య మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ దేశానికి అందించిన సేవలు ఎప్పటికీ మరువలేనివని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజాసంక్షేమ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడమే ఆమెకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాటారం డివిజన్ సర్పంచులు ఫోరం అధ్యక్షుడు కొండగొర్ల బాపు,NSUI జిల్లా అధ్యక్షుడు పురుషోత్తo అనుప్, PACS మాజీ చైర్మన్ ముక్కెర రాజమల్లు గౌడ్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాటోత్ వంశి రాజ్, మహిళా మండల అధ్యక్షురాలు ధరం సొత్ సుజాత, గ్రామ శాఖ అధ్యక్షుడు లింగమళ్ల రాజయ్య, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గడ్డం రాజబాపు,సర్పంచులు పురుషోత్తం సునీత శ్రీనివాస్, రాజు నాయక్, భూఖ్య తిరుపతమ్మ, మండల పార్టీ సెక్రెటరీ మోత్కూర్ రవి,యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు కొండ గొర్ల అశోక్ రూబీన్ నాయక్, ఉప సర్పంచ్ రామినేని పూజిత కృష్ణంరాజు, మహా ముత్తారం మాజీ ఉపసర్పంచ్, మధుకర్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు పుట్టపాక వీరస్వామి, రామగిరి రాజయ్య, సింగారం మాజీ సర్పంచ్ మొక్క నరసయ్య, యామన్ పల్లి మహిళా గ్రామ అధ్యక్షురాలు సరిత, పోలరం వార్డ్ మెంబర్ ఏనుగు మౌనిక రాజేందర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తాటి లచ్చయ్య గౌడ్, మార్క బాపు, జాడి ఓదెలు, కంకణాల చంద్రమౌళి,యువజన కాంగ్రెస్ నాయకులు, మంద జనార్ధన్, ఓడేటి రాజేందర్ రెడ్డి, పురుషోత్తం అరవింద్, రేవెల్లి లక్ష్మణ్, మంతెన వెంకటేష్, జోడ విజేందర్, గడ్డం నాగభూషణం, జాడి శంకర్, మరియు మారుపాక రాజేంద్రప్రసాద్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.