జనం న్యూస్ 19 నవంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్అ క్రమంగా వేసిన ప్లాట్లను తొలగించి పార్కు ఏర్పాటు చేయాలి అదనపు కలెక్టర్ మున్సిపల్ కమిషనర్‌కు కాలనీవాసుల వినతి జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని ఏడో వార్డు పిల్లిగుండ్ల కాలనీలో సర్వే నంబర్ 826లో సుంకులమ్మ ఆలయం సమీపంలో ఉన్న 10 శాతం భూమిని కాపాడాలని కాలనీవాసులు అధికారులను కోరారు. ప్రజా అవసరాల కోసం కేటాయించిన ఈ భూమిలో కొందరు ప్లాట్లు వేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలకు అతీతంగా ఏకమై కాలనీవాసులు గద్వాల అదనపు కలెక్టర్ నర్సింగరావు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. సర్వే నంబర్ 826లోని 10 శాతం భూమిని పరిశీలించి అందులో అక్రమంగా వేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్లాట్లపై విచారణ జరిపి నిబంధనల ప్రకారం వాటిని తొలగించాలని కోరారు. ప్రజా అవసరాల కోసం కేటాయించిన భూములు కబ్జాలకు గురైతే భవిష్యత్తులో కాలనీవాసులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూమిని పరిరక్షించి, కాలనీలోని చిన్నారులు వృద్ధులు, ప్రజలకు ఉపయోగపడేలా శాశ్వత ప్రాతిపదికన పార్కును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికైనా జిల్లా అధికారులు, మున్సిపల్ యంత్రాంగం స్పందించి స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని భూమి హద్దులను నిర్ధారించి 10 శాతం భూమిని కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు కేవలం హామీలకే పరిమితం కాకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మధు రాయుడు వెంకటేశు పాపన్న ఆచారి అశోక్ రమేష్ రామన్ గౌడ్ ఆంజనేయులు తదితర కాలనీవాసులు పాల్గొన్నారు.