కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి శాయంపేటలో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు తేది:19.11.2026,
శాయంపేట. మాజీ ప్రధానమంత్రి, ఉక్కు మహిళ, భారతరత్న ఇందిరా గాంధీ గారి ఆశయాలు నేటికీ దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకమని కాంగ్రెస్ పార్టీ శాయంపేట మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని గురువారం శాయంపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. దేశ సమగ్రత, సమైక్యత, అభివృద్ధి కోసం ఇందిరా గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆమె తీసుకున్న నిర్ణయాలు దేశ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయని పేర్కొన్నారు. దేశంలో ఎన్నో సవాళ్లు ఎదురైనా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ భారతదేశాన్ని ప్రపంచ దేశాల సరసన నిలబెట్టేందుకు కృషి చేసిన గొప్ప నాయకురాలు ఇందిరా గాంధీ అని అన్నారు. ఆమె చూపిన మార్గంలో నేటి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పయనిస్తూ ప్రజాసేవకు అంకితం కావాలని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు_కుసుమ శరత్ బాసనీ ప్రకాష్ చిందం రవి నిమ్మల రమేష్ మారపల్లి కటయ్య శంకరాచారి మారేపల్లి రాజు ఏరుకొండ శంకర్ రఫీ బూర రమేష్ బాసని రవి ప్రపంచ రెడ్డి రాజేందర్ కోల శీను పత్తి శీను తదితరులు పాల్గొన్నారు.