ఆంధ్రప్రదేశ్

అంబాజీపేట ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేసిన గణపతి తులసీ రాఘవులుకు అభినందనలు

అంబాజీపేట ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేసిన గణపతి తులసీ రాఘవులుకు అభినందనలు

జనం న్యూస్ నవంబర్ 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షులు గుత్తుల సాయి, ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు అభినందన అంబాజీపేట: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేసిన గణపతి తులసీ రాఘవులు గారిని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు గారు ఘనంగా అభినందించారు. మండల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంపీపీగా సమర్థవంతంగా పని చేయాలని వారు ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి చేరవేయాలని సూచించారు. పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులందరూ సమన్వయంతో పని చేసి మండలాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గణపతి తులసీ రాఘవులు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మండల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు గారు, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు, పలువురు టీడీపీ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇ-పేపర్