ఎస్.కె.బి.ఆర్ కాలేజీలో కిమ్స్ ఆధ్వర్యంలో ఘనంగా మెడికల్ క్యాంప్జ నం న్యూస్ నవంబర్ 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఈరోజు ఉదయం ఎస్.కె.బి.ఆర్ కాలేజీలో కిమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ క్యాంప్, నడవండి – నడిపించండి కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కిమ్స్ చైర్మన్ చైతన్య రాజు ముఖ్య అతిథిగా పాల్గొని, స్వయంగా నడకలో పాల్గొని అందరినీ ఉత్సాహపరిచారు. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని, రోజూ నడక అలవాటు చేసుకుంటే ఎన్నో రోగాలకు దూరంగా ఉండవచ్చని చైతన్య రాజు సూచించారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడమే కిమ్స్ లక్ష్యమని, సేవే పరమావధిగా ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ లో వందలాది మందికి ఉచితంగా బీపీ, షుగర్, గుండె, సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, 28వ వార్డ్ కౌన్సిలర్ మోకా వెంకట సుబ్బారావు పాల్గొని చైతన్య రాజు సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోనం సత్య వర ప్రసాద్ పాల్గొని, ఆరోగ్య చైతన్యానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని అన్నారు. ఉదయాన్నే పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువకులు, పెద్దలు, మహిళలు నడకలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చైతన్య రాజు ఆధ్వర్యంలో కిమ్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలు కోనసీమ ప్రజలకు ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నాయని పలువురు ప్రశంసించారు. చివరిగా నిర్వాహకులకు, వైద్య బృందానికి, పాల్గొన్న ప్రతి ఒక్కరికీ చైతన్య రాజు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.