జనం న్యూస్ నవంబర్ 20 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్లకు పార్టీ నాయకులు గ్రామ సర్పంచ్ సాద్విక సాయినాథ్, ఉపసర్పంచ్ ప్రశాంత్ కుమార్ లు లబ్దిదారులు జక్కం లక్ష్మి ఇంటికి ముగ్గు పోయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా ప్రత్యేక అధికారి శ్రీనివాస్, మండల తహశీల్దార్ గంగాసాగర్,బీబీపేట్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పాతరాజు, సొసైటీ చైర్మన్ సుతారి రమేష్, గ్రామ జిల్లా కాంగ్రెస్ నాయకులు సలీం, వార్డు సభ్యులు యూత్ నాయకులు మహేష్, స్వామి, కమిటీ సభ్యులు గ్రామ పంచాయతీ కార్యదర్శి గూడ రమేష్, పాల్గొన్నారు.