జనం న్యూస్ నవంబర్ 20 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా – చిలిపిచెడ్ మండలం లోని జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు చిలిపిచెడ్ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆన్లైన్ క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగింది. విద్యార్థుల్లో సాధారణ విజ్ఞానం, విషయ పరిజ్ఞానం, తార్కిక ఆలోచనా శక్తి, డిజిటల్ పరిజ్ఞానాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని విద్యార్థులందరూ ఆన్లైన్ క్విజ్‌లో పాల్గొనేలా చర్యలు చేపట్టారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా క్విజ్‌లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు ఈ కార్యక్రమాన్ని మండల విద్యాధికారి విఠల్ పర్యవేక్షించగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రమేష్ దనమూర్తి నాగరాజు సమన్వయం చేశారు. మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో విశేష కృషి చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులలో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పోటీతత్వాన్ని పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరింత ఉపయోగపడతాయని మండల విద్యాశాఖ అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలను సమర్థవంతంగా అమలు చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ అభనందనలు తెలియజేశారు.