జనం న్యూస్ నవంబర్ 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం తల్లిదివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు గజ్జి శంకర్ ఆదేశాల మేరకు మండలంలో మండల ప్రధాన కార్యదర్శి తడక సంతోష్ ఆద్యరంలో గోవిందాపూర్ గ్రామానికి చెందిన ముప్పు రాజు ను గ్రామ అద్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా బోడ్డు రాధక్క, ప్రధాన కార్యదర్శి వాణిలను నియమిస్తు నియామక పత్రాన్ని ఇవ్వడం జరిగింది.అనంతరం ఎన్నికైన వారు మాట్లాడుతూ మా ఎన్నికలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కోయిల శ్రీకాంత్, మండల కార్యదర్శి చింతల శ్రీనివాస్ , పెద్దకొడపాక గ్రామ అధ్యక్షుడు అబ్బు రఘుపతిరెడ్డి, పెద్దకొడపాక గ్రామ ఉపాధ్యక్షులు చింతల రమేష్ తదితరులు పాల్గొన్నారు.