ఆంధ్రప్రదేశ్

ఓటరు చైతన్యానికి మహిళా నాయకత్వం.. రాష్ట్ర కార్యదర్శిగా వీరమల్ల రమశ్రీ

ఓటరు చైతన్యానికి మహిళా నాయకత్వం.. రాష్ట్ర కార్యదర్శిగా వీరమల్ల రమశ్రీ

జనం న్యూస్ 24 నవంబర్ మంగళవారం సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై. రమేష్ సిద్దిపేటకు చెందిన సామాజిక సేవకురాలు వీరమల్ల రమశ్రీకి రాష్ట్రస్థాయి బాధ్యతలు లభించాయి. యునైటెడ్ ఓటర్స్ సోషల్ ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా ఆమె నియమితులయ్యారు. ఈ సందర్భంగా రమశ్రీ మాట్లాడుతూ మహిళలు, యువతలో ఓటు హక్కుపై అవగాహన కల్పించడం, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఓటు హక్కును వినియోగించుకునేలా చైతన్యం తీసుకురావడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఓటరు చైతన్య కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన ఫౌండేషన్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సంస్థ అభివృద్ధికి, మహిళా సాధికారతకు అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. రమశ్రీకి రాష్ట్రస్థాయి బాధ్యతలు దక్కడం పట్ల సిద్దిపేటకు చెందిన పలువురు సామాజిక ప్రముఖులు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

ఇ-పేపర్