జనం న్యూస్ 24 నవంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్గ్రా మ పాలనలో పారదర్శకత రావాలి ప్రతి గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందాలి తెలంగాణ రాజ్యాధికార పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు సిందనూరు గంగాధర్ సర్పంచ్ వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి విధులు గ్రామ నిధుల వినియోగంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రజాప్రతినిధులు అధికారుల బాధ్యత సర్పంచ్: గ్రామ అభివృద్ధి పనులకు నాయకత్వం వహించి, గ్రామ పంచాయతీ నిధులను నిబంధనల ప్రకారం వినియోగించాలి వార్డు సభ్యులు: తమ వార్డులోని ప్రజా సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలి గ్రామ కార్యదర్శి: పంచాయతీ రికార్డులు, నిధుల ఆదాయ వ్యయాలు, ప్రభుత్వ పథకాలు అభివృద్ధి పనుల వివరాలను నిబంధనల ప్రకారం నిర్వహించాలి.గ్రామ పంచాయతీ నిధులు: గ్రామానికి వచ్చే ప్రభుత్వ నిధులు, వాటి ఖర్చులు, చేపట్టిన పనుల వివరాలు ప్రజలకు పారదర్శకంగా తెలియజేయాలి గ్రామసభ: ప్రజల సమస్యలు చర్చించి, గ్రామ అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి.తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్: జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో నిధుల వివరాలు అభివృద్ధి పనుల వివరాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి గ్రామాల్లో తాగునీరు, రోడ్లు డ్రైనేజీ వీధి దీపాలు పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి మా పార్టీ నినాదం సర్పంచ్ ఏ పార్టీ వారైనా వార్డు సభ్యులు ఏ పార్టీ వారైనా గ్రామ అభివృద్ధి విషయంలో అందరూ ఒక్కటిగా పనిచేయాలి గ్రామ నిధులు ప్రజల సొమ్ము వాటి వినియోగంపై ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంది. గ్రామ పాలనలో పారదర్శకతే మా లక్ష్యం తెలంగాణ రాజ్యాధికార పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు సింధనూర్ ఉప్పరి గంగాధర్.