నేడుశ్రీ ప్రసన్న వర్ధాంజనేయ స్వామి జయంతి వేడుకలు

May 11, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 11-05-26నందలూరుమండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోగల ఆరవపల్లె గ్రామం నందు టంగుటూరు ప్రకాశం వీధి లో వెలసినటువంటి శ్రీ ప్రసన్న వర్ధాంజనేయ స్వామి దేవస్థానం నందు నేడు శ్రీ హనుమాన్ జయంతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు హనుమాన్ పాద సేవకులు తెలిపారు. సోమవారం ఉదయం ప్రత్యేక పూజలు. తీర్థ ప్రసాదాల వినియోగం. సాయంత్రం స్వామివారికి పాలాభిషేకం. 12వ తేదీ ఉదయం ప్రత్యేక పూజలు 10:30 కి పంచామృతాభి షేకం ఆకు పూజ 11 గంట లకు హనుమాన్ జయంతి సందర్భంగా ఎక్కడ చేయ లేనటువంటి శ్రీ హనుమత్ వ్రతము ఈ దేవస్థానం నందు నిర్వహించడంప్రత్యేకత.అనంతరం.కుంకు మార్చన నిర్వహించ నున్నట్లు ఆలయ కమిటీ తెలిపారు కుంకుమార్చన లో పాల్గొనే మహిళలు టెంకాయ, పూలు, పండ్లు, స్వామివారి సంభావన తెచ్చుకోవాల్సిందిగా తెలియ జేశారు. మధ్యా హ్నం 12:30 కి అన్న ప్రసాద వితరణ. సాయం త్రం 6 గంటలకు పుర వీధులలో శ్రీ హను మాన్ గ్రామోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించ నున్నట్లు శ్రీ హనుమాన్ పాద సేవకులు తెలిపారు.

📰 ePaper