నేటి నుంచి కాళేశ్వరం పంపుల డ్రై రన్ ప్రారంభం
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్. బి. వీరేశం జులై. 01. 07. 2026 నేటి నుంచి కాళేశ్వరం పంపుల డ్రై రన్ ప్రారంభం
జులై 01 నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ 2 లోని నంది, ప్యాకేజీ 8 పంప్ హౌస్‌లలోని 14 మోటార్లను రోజుకు 15 నిమిషాల చొప్పున డ్రై రన్ చేయనున్నారు. ట్రాన్స్ కో నుంచి అనుమతి లభించింది. వర్షాకాలంలో ఎల్లంపల్లి నుంచి నీటిని ఎత్తిపోసేందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్ల కోసం జియో టెక్నికల్ టెస్టులు పూర్తయ్యాయి. బ్యారేజీల పటిష్టతను తెలుసుకునేందుకు కోర్ శాంపిళ్లను సేకరించి పరీక్షించారు. మేడిగడ్డ, సుందిళ్లలో మరికొన్ని గేట్ల వద్ద పరీక్షలు మరో 15 రోజుల్లో పూర్తికానున్నాయి.