ఓటరు జాబితా సవరణకు కీలక దశ

July 2, 2026 | తెలంగాణ

ఓటర్లకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు సందేహాలకు అక్కడే పరిష్కారం

జనం న్యూస్-జూలై 2- నాగార్జునసాగర్ టౌన్- నందికొండ మున్సిపాలిటీలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా అప్లికేషన్ల పంపిణీ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది . అప్లికేషన్లు అందుకున్న ప్రతి ఓటరు వాటిని పూర్తిగా నింపి నిర్ణీత గడువులోగా సంబంధిత బీఎల్‌వోలకు తప్పనిసరిగా సమర్పించాలని పెద్దవూర మండల రెవెన్యూ ప్రోటోకాల్ ఆఫీసర్, ఆర్ ఐ దండ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.అప్లికేషన్ నింపే విషయంలో ఓటర్లకు ఎలాంటి సందేహాలు ఉన్నా పెద్దవూర ఎమ్మార్వోఖాసీం నాయక్ ఆదేశాల మేరకు స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు  ఈ సదుపాయాన్ని మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఓటరు వినియోగించుకుని తమ దరఖాస్తులను సక్రమంగా పూర్తి చేయాలని ఆయన కోరారు. ఇప్పటికీ ఎస్‌ఐఆర్ ఫారమ్అందని ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వెంటనే సంబంధిత బీఎల్‌వోను లేదా స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.అప్లికేషన్లు సమర్పించని పక్షంలో ఓటరు జాబితాలో పేరు కొనసాగింపుపై ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. అందువల్ల ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతా యుతంగా వ్యవహరించి గడువులోగా దరఖాస్తులు అందజేయాలని సూచించారు.ప్రజల నుంచి మంచి సహకారం లభిస్తుండటంతో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం సజావుగా, చురుగ్గా కొనసాగుతుండటం సంతోషకరమని దండ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

🌐 Select Language:
📰 ePaper