ఎంపికైన అంగన్వాడీ అభ్యర్థులు దాట్ల సుబ్బరాజును కలిశారు

August 24, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ ఆగస్టు 24 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ)ఇటీవల జరిగిన అంగన్వాడీ నియామకాలలో ఆయా పోస్టులకు ఎంపిక అయిన అభ్యర్థులు ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం శాసనసభ్యుల కార్యాలయంలో ప్రభుత్వ విప్ ముమ్మడివరం శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపికైన అభ్యర్థులు శాసనసభ్యుడికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యుడు మాట్లాడుతూ ఎంపికైన అభ్యర్థులు సేవాభావంతో ఈ వృత్తిని నిర్వహించాలని ఆకాంక్షించారు. పిల్లల ఆరోగ్యం పోషణ విద్యకు అంగన్వాడీ కేంద్రాలు కీలకమని వాటి బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తించాలని సూచించారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు పేద పిల్లలకు సేవలు అందించేందుకు ఈ నియామకాలు చేపట్టిందని తెలిపారు. ప్రభుత్వం ప్రతి కేంద్రానికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తోందని కేంద్రాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు. కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని మరిన్ని అవకాశాలు కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కాట్రేనికోన మండల ఇంచార్జ్ దాట్ల పవన్ ఐ పోలవరం టిడిపి అధ్యక్షులు సాగిరాజు సాయిరాజు, స్థానిక నాయకులు పార్టీ కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper