మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మఠంపల్లికి బదిలీ

May 11, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ మే 11 కందిబండ హరీష్ మునగాల మండల రిపోర్టర్ )సూర్యాపేట జిల్లాలో ఎస్సైల బదిలీలలో భాగంగా, సోమవారం మునగాల పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ బి. ప్రవీణ్ కుమార్ మఠంపల్లి పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్సై గా నియమితులయ్యారు. ప్రస్తుతం మఠంపల్లిలో పనిచేస్తున్న ఎస్ఐ బాబు నల్గొండ వీఆర్ కు బదిలీ అయ్యారు.ప్రవీణ్ కుమార్ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. మునగాల మండలంలో ఆయన సమర్థవంతంగా విధులు నిర్వహించి,ప్రజలకు మెరుగైన సేవలు అందించారు.మఠంపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా ఆయన ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

📰 ePaper