సాగు యజమాన్య పద్ధతులపై అవగాహన

July 2, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 03జులై పెగడపల్లి జగిత్యాల జిల్లాపెగడపల్లిమండలంలోని రాములపల్లి గ్రామంలో టీ ఆర్ వి కే కోఆర్డినేటర్ డా. ఎ. విజయ్ భాస్కర్ పత్తి, వరి నర్సరీ మరియు పసుపు విత్తె పొలాలలో క్షేత్ర సందర్శనలు నిర్వహించబడినవి. ఈ సందర్భం గా రైతులకు ఆయా పంటలలో అనుసరించాల్సిన సాగు యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించబడింది. పత్తి పంటలో రసం పీల్చే పురుగుల ఉధృతి గమనించబడగా, వాటి నివారణకు లీటరు నీటికి ఏసిఫేట్ 75 ఎస్ పి 1.5 గ్రా/మోనోక్రోటోఫాస్ 36 ఎస్ ఎల్ 1.6 మి లీ. లేదా 5 మీ.లీ వేపనూనె పిచికారీ చేయాలని రైతులకు సూచించబడింది.వరి నర్సరీలో కాలిబాటలు నిర్వహణతో పాటు, మొక్కల అంచు భాగాన్ని కత్తిరించడం ద్వారా మంచి పెరుగుదల మరియు చీడపీడల నియంత్రణ సాధ్యమవుతుందని వివరించబడింది. పసుపు పంటలో దుంప కుళ్ళు వ్యాధి నివారణకు విత్తన శుద్ధి చేయడం ఉత్తమమనిరైతులకుతెలియజేయ బడింది.ఈ కార్యక్రమంలో ఎమ్ ఏ ఓ శ్రీకాంత్, ఏఈఓ సరోజిని మరియు రైతులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper